హైదరాబాద్: 28°C
తెలంగాణ

చాకలి ఐలమ్మ సేవలు చిరస్మరణీయం: అడిషనల్ కలెక్టర్

JGL: తెలంగాణ సాయుధ పోరాటంలో వీరనారి చాకలి ఐలమ్మ సేవలు చిరస్మరణీయమని అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్ అన్నారు. జగిత్యాల కలెక్టరేట్‌లో ఐలమ్మ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఆమె చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.