హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి

KMR: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. చాకలి ఐలమ్మ చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల్లో పోరాట స్ఫూర్తిని నింపిన మహనీయురాలు చాకలి ఐలమ్మ అని నాయకులు కొనియాడారు.