MLG: అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా వయోవృద్ధుల వారోత్సవాల్లో భాగంగా శనివారం ములుగు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. సుమారు 40 మంది వయోవృద్ధులకు కంటి పరీక్షలు చేసి, అవసరమైన వారికి వైద్య సలహాలు, ఉచిత మందులు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
'వయోవృద్ధులకు ఉచిత కంటి వైద్య శిబిరం'


