హైదరాబాద్: 28°C
తెలంగాణ

పరిశుభ్రతతో అంటువ్యాధులకు చెక్

VKB: ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అంటువ్యాధులను నియంత్రించవచ్చని సర్పంచ్ సురేశ్ నాయక్ అన్నారు. ధరణివాగు, ఒంటిమామిడి, జయరాం తండాల్లో ఇంటింటికీ డస్ట్‌బిన్లను పంపిణీ చేశారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి పారిశుధ్య వాహనాలకు అందించాలని సూచించారు. రోడ్లపై చెత్త వేయకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, దోమల బెడదను అరికట్టాలని కోరారు.