హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉత్తమ గురువు అవార్డుకు భౌతికశాస్త్ర టీచర్

VKB: నాగారం ZPHSలో భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బాలరాజు జిల్లా ఉత్తమ గురువు అవార్డుకు ఎంపికయ్యారు. 23 ఏళ్లుగా విద్యాబోధనలో సేవలందిస్తున్న ఆయన విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. జిల్లా రిసోర్స్‌పర్సన్‌గా తోటి ఉపాధ్యాయులకు ఆధునిక బోధనా పద్ధతులపై శిక్షణ ఇస్తున్నారు. బాలరాజు ఎంపికపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.