హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వృథాగా పోతున్న తాగునీరు'

AKP: గొలుగొండ మండలం పప్పుశెట్టిపాలెంలో కొళాయి నుంచి తాగునీరు వృథాగా పోతోందని స్థానికుడు బొడ్డు గోవింద ఇవాళ పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన జాలెం కొండబాబు కుటుంబం వలస వెళ్లడంతో, వారి ఇంటి వద్ద కొళాయి నిరంతరం ప్రవహిస్తూ నీరు వృథా అవుతోంది. దీనివల్ల ఎగువన ఉన్న ఇళ్లకు నీరు అందడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.