హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీసులను చూసి రౌడీలు భయపడాలి: మంత్రి

ATP: అనంతపురం పీటీసీలో సివిల్ కానిస్టేబుళ్ల 2025-26 బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్‌లో మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడారు. ఖాకీ యూనిఫార్మ్ అధికారంతో పాటు బాధ్యతను ఇస్తుందని అన్నారు. పోలీసులను చూసి రౌడీలు భయపడాలి తప్ప ప్రజలు కాదని తెలిపారు. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో టెక్నాలజీని నిరంతరం నేర్చుకోవాలని సూచించారు.