హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహార ఉత్సవాలు

GNTR: కర్లపాలెం మండలం నర్రావారిపాలెం పంచాయతీ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో శనివారం పోషకాహార మాసోత్సవాలు నిర్వహించారు. నర్రావారిపాలెం, కట్టవాద, మర్రికట్టవ గ్రామాల్లో కార్యక్రమాలు జరిగాయి. గర్భిణులు, చిన్నారుల్లో పోషకాహార లోపం నివారించడమే లక్ష్యమన్నారు. మిషన్‌ వాత్సల్య లబ్ధిదారుతో మాట్లాడించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.