TPT: కోట మండలంలోని గూడలి గ్రామం స్వర్ణముఖి బ్రిడ్జి సమీపంలో ఇళ్ల నుంచి మురుగునీటిని భారీ పైపుల ద్వారా నేరుగా రోడ్డుపైకి వదులుతున్నారని స్థానికులు వాపోతున్నారు. వాహనాలు వెళ్లే సమయంలో మురికి నీరు చిమ్మడంతో విద్యార్థులు, ఉద్యోగులు, ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డుపైకి మురుగునీరు.. ఇబ్బందుల్లో ప్రజలు


