CTR: జీడీ నెల్లూరు మండలంలోని డంపింగ్ యార్డులో శుక్రవారం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఎంపీడీవో మనోహర్ గౌడ్ ఆధ్వర్యంలో డంపింగ్ యార్డు చుట్టూ వివిధ రకాల మొక్కలను నాటారు. డంపింగ్ యార్డు పరిసరాలను పచ్చదనంగా మార్చడంతో పాటు, పరిశుభ్రమైన వాతావరణం కల్పించే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
జీడీ నెల్లూరు డంపింగ్ యార్డులో ప్లాంటేషన్


