హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'యెర్నిమాంబ ఆలయ అభివృద్ధికి కృషి చేయాలి'

VSP: జ్ఞానాపురం యెర్నిమాంబ అమ్మవారి ఆలయ నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం శుక్రవారం జరిగింది. చైర్మన్‌గా గణేష్‌తో పాటు సభ్యులు ప్రమాణం చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ సంప్రదాయాలను కాపాడుతూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ధర్మకర్తలుగా బాధ్యతలు చేపట్టడం గొప్ప అదృష్టమన్నారు.