హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

13వ వార్డులో రోడ్డు మరమ్మతులు ప్రారంభం

నంద్యాల 13వ వార్డులో భీమాస్ హోటల్ సమీపంలోని నేషనల్ జూనియర్ కాలేజీ రోడ్డు సమస్యపై మంత్రి ఎన్ఎండీ ఫరూక్ స్పందించారు. రోడ్డు గుంతలు, వర్షపు నీటి నిల్వతో ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు తెలపడంతో అధికారులను మంత్రి ఆదేశించారు. మంత్రి సూచనలతో వెట్‌మిక్స్‌తో ప్యాచ్‌వర్క్ పనులు ప్రారంభించారు. పనులు చేపట్టడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.