కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలోని 68 వార్డులకు సంబంధించి 486 పోలింగ్ కేంద్రాల ప్రతిపాదిత ముసాయిదా జాబితాను కమిషనర్, అడిషనల్ ఎలక్షన్ అథారిటీ చల్లా ఓబులేసు ఇవాళ ప్రదర్శించారు. జాబితాపై సలహాలు, సూచనలు ఉంటే రేపు సాయంత్రం 5 గంటలలోగా సమర్పించాలని తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ కేంద్రాల జాబితా ముసాయిదా ప్రదర్శన


