హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఆలమూరులో పదో రోజుకు చేరిన నిరవధిక సమ్మె

కోనసీమ: తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆలమూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు చేపట్టిన నిరవధిక సమ్మె 10వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. పే స్కేల్ అమలు చేయాలని, అర్హులకు పదోన్నతులు కల్పించాలని, మృతిచెందిన వీఆర్ఏల కుటుంబాల్లో ఒకరికి కారుణ్య నియామకం ఇవ్వాలని డిమాండ్ చేశారు.