హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొత్తచెరువులో ఉలవ విత్తనాల పంపిణీ

SS: కొత్తచెరువులో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఉలవ విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సామకోటి ఆదినారాయణ పాల్గొన్నారు. వర్షాభావ పరిస్థితుల్లో రైతులు ప్రత్యామ్నాయ పంటగా ఉలవ సాగు చేయాలని సూచించారు. పశువులకు ఉలవ గ్రాసం మేలు చేస్తుందని తెలిపారు.