హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఇళ్లల్లోకి వర్షం నీరు.. తక్షణ చర్యలు

E.G: దేవరపల్లి మండలం ధుమంతునిగూడెంలో వర్షాల కారణంగా నీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమస్యను జనసేన పార్టీ గ్రామ ప్రధాన కార్యదర్శి అయినాల నరసింహమూర్తి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు కూటమి నాయకులు గ్రామానికి చేరుకుని జేసీబీ సహాయంతో కాలువల్లో పేరుకుపోయిన మట్టి, చెత్తను తొలగించారు. వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపట్టారు.