ATP: యాడికి మండలం కొనుప్పలపాడు గ్రామంలో రీసర్వే పూర్తయినందున రైతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజముద్రతో కూడిన పాసుబుక్కులను తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి పంపిణీ చేశారు. భూమిపై రైతులకు మాత్రమే హక్కు ఉంటుందని, నాయకుల ఫోటోలు అవసరం లేదని స్పష్టం చేశారు. మండలానికి నీళ్లు అందిస్తామని తెలిపారు. తాగే నీటి కోసం ఏర్పాటు చేసిన బోరును ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
రైతులకు పాసుబుక్కులు అందజేసిన ఎమ్మెల్యే


