హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాంప్లెక్స్‌లోని జలాశయాలకి పోటెత్తుతున్న వరద ఉద్ధృతి

VSP: సీలేరు కాంప్లెక్స్‌ పరిధిలోని జలాశయాలకు వరద ప్రవాహం భారీగా పెరిగింది. రిజర్వాయర్లు పూర్తిస్థాయి నీటిమట్టాలకు చేరువ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. డొంకరాయి జలాశయం నాలుగు గేట్లు ఎత్తి 36 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సీలేరు జలాశయం రెండు గేట్లు ఎత్తి 3,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.