హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రామాల్లో పారిశుధ్యంపై ముమ్మర నిఘా

BPT: గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరిచి, ప్రజలను ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మండల పరిధిలోని ఏల్చూరు గ్రామంలో శుక్రవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో చేపట్టిన ‘ఇంటింటికీ పారిశుధ్యం’ కార్యక్రమాన్ని పంచాయతీ కార్యదర్శి పూర్ణచంద్‌తో పాటుగా గ్రామ సచివాలయ కార్యదర్శులు రత్నకుమారి, ప్రసన్న క్షేత్రస్థాయిలో పరిశీలించారు.