హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 28న మెగా జాబ్ మేళా

NTR: నందిగామలో ఈనెల 28న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అధికారి మధుభూషణ్‌రావు తెలిపారు. APSSDC ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు గాంధీ సెంటర్‌లోని APNGO భవన్‌లో మేళా జరుగుతుందన్నారు. 10 ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని, టెన్త్ నుంచి పీజీ వరకు చదివిన 18–35 ఏళ్ల యువత అర్హులన్నారు. ఎంపికైన వారికి రూ.12 వేల నుంచి రూ.35 వేల వేతనం ఉంటుందన్నారు.