హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ వీడియో

PLD: పంచారామ క్షేత్రాలలో ప్రథమమైన శ్రీ బాల చాముండికా సమేత శ్రీ అమరేశ్వర స్వామి కొలువై ఉన్న అమరావతిలో శుక్రవారం ఉదయం పరవళ్ళు తొక్కుతూ.. కృష్ణమ్మ ప్రవహిస్తోంది. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి నీరు రావడంతో నదిలో ప్రవాహం ఉద్ధృతంగా ఉంది. ఎంతోకాలంగా నదిలో నీరులేక బోసుపోయి ఉంది. ప్రస్తుతం జలకళ సంతరించుకోవడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.