హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయవాడలో ఎమ్మెల్యేకు స్థానికుల ప్రశ్నలు

NTR: విజయవాడలో ఎమ్మెల్యే ఉమామహేశ్వరరావును స్థానికులు తమ సమస్యలపై నిలదీశారు. వరదల సమయంలో తమను పట్టించుకోలేదని, నాలుగు రోజుల తర్వాత కూడా తాము పిలిస్తేనే వచ్చారని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం పడితే ఇళ్లలోకి నీరు వస్తోందని, రోడ్డు నిర్మించాలని కోరారు. నిధులు మంజూరయ్యాయని, త్వరలో రోడ్డు నిర్మిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.