హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రిజర్వాయర్ గట్టు దుస్థితితో ప్రజల అవస్థలు

PPM: రిజర్వాయర్ గేట్లు ఎత్తిన సమయంలో రోడ్డు మార్గంలో రాకపోకలు నిలిచిపోతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, ప్రజలు రిజర్వాయర్ గట్టుపై నుంచి కాలినడకన వెళ్లాల్సి వస్తోంది. అయితే ఒట్టిగడ్డ రిజర్వాయర్ గట్టు పూర్తిగా చెట్లు, చేమలతో అల్లుకుపోవడంతో నడిచేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.