SKLM: తుపానుతో ముంపునకు గురైన పంటలకు పరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కోన్నా శ్రీనివాస్ కోరారు. శుక్రవారం సారవకోట మండలంలో ముంపు పొలాలను ఆయన పరిశీలించారు. కొద్ది రోజుల్లో చేతికి రావాల్సిన పంటలు నీట మునగడంతో రైతులు ఆవేదన చెందుతున్నారన్నారు. రెవెన్యూ, వ్యవసాయ అధికారులు వెంటనే పరిశీలించి, పరిహారం అందించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ముంపు రైతులను ఆదుకోవాలి: సీపీఐ


