హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుడివాడలో వైసీపీ కీలక సమావేశం

కృష్ణా: గుడివాడ నియోజకవర్గ స్థాయి స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధ సమావేశం ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు గుడివాడ మండలం లింగవరం రోడ్డులోని కె-కన్వెన్షన్‌లో నిర్వహించనున్నారు. మాజీ మంత్రి నాని అధ్యక్షతన ఈ సమావేశం జరగనున్నదని వైసీపీ నేతలు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణుల సన్నద్ధత, ఎన్నికల కార్యాచరణ, తదితర అంశాలపై చర్చించనున్నారు.