హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఒంగోలు సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

ప్రకాశం: ఒంగోలు -సూరారెడ్డిపాలెం రైల్వే స్టేషన్ల మధ్య సంఘమిత్ర హైవే బ్రిడ్జి కింద గూడ్స్ రైలు ఢీకొని గురువారం రాత్రి 70 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడు స్కైబ్లూ పూల డిజైన్ చొక్కా, నల్ల మొలతాడు, బిస్కెట్ రంగు హవాయి చెప్పులు ధరించి ఉన్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. వ్యక్తి మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.