హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పేడ రంగు విక్రయాలు జరిపితే కఠిన చర్యలు'

NDL: బేతంచెర్ల పట్టణంలో కిరణం దుకాణాల్లో పేడ రంగు విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని సీఐ డీ. వెంకటేశ్వరరావు హెచ్చరించారు. వారు మాట్లాడుతూ.. పేడ రంగులో విష రసాయనాలు ఉండడం వల్ల నీటిలో కలుపుకొని సేవిస్తే వెంటనే చనిపోతారన్నారు. గత ఆరు నెలల్లో మండల, పట్టణంలో కుటుంబ కలహాలు వల్ల మహిళలు క్షణికావేశంలో పేడ రంగు త్రాగడం వల్ల చనిపోతున్నారన్నారు.