హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రిజర్వాయర్‌లో పుష్కలంగా సాగునీరు

AKP: వాయుగుండం కారణంగా గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు కసింకోట మండలం జామాదులపాలెం రిజర్వాయర్‌లో పుష్కలంగా నీరు చేరింది. దీంతో రిజర్వాయర్ నీటితో కళకళలాడుతుంది. 50 ఎకరాల విస్తీర్ణంలో గల ఈ రిజర్వాయర్ ద్వారా 200 ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆయకట్టుదారులు తెలిపారు. వచ్చే వేసవి వరకు సాగునీటికి కొరత ఉండదన్నారు.