హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనధికార పోస్టర్లపై కఠిన చర్యలు: కమీషనర్

కర్నూలు నగరంలో గోడలు, డివైడర్లు, స్తంభాలు, ప్రభుత్వ ఆస్తులపై అనధికార పోస్టర్లు, బ్యానర్లు, ప్రకటనలు ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవని కమిషనర్ చల్లా ఓబులేసు హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వ్యాపార సంస్థల ట్రేడ్ లైసెన్సులు రద్దు చేయడంతో పాటు జరిమానాలు, కేసులు నమోదు చేస్తామని తెలిపారు. నగర సుందరీకరణకు భంగం కలిగించే ప్రకటనలపై నిఘా కొనసాగుతుందన్నారు.