హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో 114.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

ATP: జిల్లాలో గత 24 గంటల్లో 114.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని అధికారులు శుక్రవారం తెలిపారు. కుందుర్పి మండలంలో అత్యధికంగా 24.6 మి.మీ, గుంతకల్లులో 20 మి.మీ వర్షం కురిసిందని అన్నారు. జిల్లాలోని మొత్తం 32 మండలాల్లో 18 మండలాల్లో అసలు వర్షం పడలేదని పేర్కొన్నారు. జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.