హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కుక్కల విషయంలో గొడవ.. పరస్పర దాడులు

NTR: విజయవాడ కృష్ణలంకలో కుక్కల విషయంలో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. కుక్కలు ఇంటిని పాడు చేస్తున్నాయన్న విషయంపై మాట్లాడేందుకు వెళ్లిన మహిళతో పక్కింటి వారు గొడవకు దిగారు. ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. గాయపడిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.