హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బుడమేరు ఉగ్రరూపం.. రాకపోకలకు అంతరాయం

కృష్ణా: నందివాడ మండలంలో బుడమేరు శుక్రవారం ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో బుడమేరును ఆనుకుని ఉన్న పరివాహక ప్రాంతాల్లో పంట పొలాలు నీటమునిగాయి. దీంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. పుట్టగుంట వద్ద బుడమేరు వంతెనపై సుమారు అడుగు ఎత్తులో వరద నీరు ప్రవహిస్తోంది. అధిక ప్రవాహం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.