హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదు

AKP: తీవ్ర వాయుగుండం ప్రభావంతో జిల్లాలో శుక్రవారం ఉదయం 6 గంటల వరకు కుండపోత వర్షం కొనసాగింది. గత నాలుగు రోజుల్లో కలిపి జిల్లా సగటున 185.3 మి.మీ వర్షపాతం రికార్డైంది. అత్యధికంగా అచ్యుతాపురంలో 278.1 మి.మీ, సబ్బవరంలో 239.4 మి.మీ, పరవాడలో 230.6 మి.మీ వర్షం కురిసింది. జిల్లాలోని మొత్తం 24 మండలాల్లోనూ 100 మి.మీ దాటి భారీ వర్షపాతం నమోదు అయ్యింది.