హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా పరిషత్తులకు ఉద్యోగుల కేటాయింపు

CTR: ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిషత్ ఉద్యోగుల విభజన ప్రక్రియను పూర్తిచేశారు. నూతనంగా ఏర్పడిన చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల పరిధిలోని జిల్లా పరిషత్తులకు మొత్తం 88 మంది ఉద్యోగులను కేటాయించినట్లు జేడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు తెలిపారు. చిత్తూరు జెడ్పీకి అత్యధికంగా 38 మంది, తిరుపతి జెడ్పీకి 27 మంది, అన్నమయ్య జెడ్పీకి 23 మంది ఉద్యోగులను కేటాయించారు.