CTR: చిత్తూరు ప్రభుత్వ ITIలో PM కౌశల్ వికాస్ యోజన పథకంలో భాగంగా ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపల్ రవీంద్రరెడ్డి తెలిపారు. ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ అసెంబ్లీ ఆపరేటర్ కోర్సులో అభ్యర్థులకు 3 నెలల ఉచిత నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18-35 సంవత్సరాలు ఉండాలని, ఆసక్తి ఉన్నవారు సంప్రదించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఐటిఐలో ఉచిత నైపుణ్య శిక్షణ


