VZM: భోగాపురం మండలం రెడ్డి కంచేరుకు చెందిన గావు దుర్గారావుపై పీడీ యాక్ట్ అమలు చేసినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. గంజాయి,కొట్లాటకు సంబంధించి ఐదు కేసుల్లో నిందితుడిగా ఉన్నారని, విజయనగరం పోలీసుస్టేషన్‌లో రౌడీషీట్ ఉందన్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నందున ఏడాది పాటు బెయిల్ రాకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గంజాయి కేసులో నిందితుడిపై పీడీ యాక్ట్


