హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్టోబర్ 1 మధ్యాహ్నం నుంచి పింఛన్ల పంపిణీ

KDP: NTR భరోసా పింఛన్లను అక్టోబర్ 1న మధ్యాహ్నం నుంచి పంపిణీ చేయనున్నారు. బ్యాంకు ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ఉదయం నగదు డ్రా చేసి, మధ్యాహ్నం నుంచి లబ్ధిదారులకు అందించనున్నారు. జిల్లాలో 2,76,414 మంది పింఛనుదారులకు రూ.120.82 కోట్లను తొమ్మిది బ్యాంకుల శాఖలకు సమకూర్చారు .కొత్త పింఛన్ల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నందున వాటికి నిధులు మంజూరు కాలేదని అధికారులు తెలిపారు.