SKLM: కవిటి మండలానికి చెందిన మొగిలిపురి శ్రుతి రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైంది. ఇటీవల జిల్లా కేంద్రంలో నిర్వహించిన అండర్-20 నడక విభాగంలో ఈమె ప్రథమ స్థానం కైవసం చేసుకుంది. దీంతో అక్టోబరులో నంద్యాలలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నట్లు శిక్షకుడు ఎం.సతీష్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జాతీయ పోటీలకు ఎంపికైన క్రీడాకారిణి


