హైదరాబాద్: 28°C
తెలంగాణ

తుంగభద్రా నదిలో బోటింగ్‌ సందడి

GDWL: అలంపూర్‌ శ్రీ జోగులాంబ ఆలయ సమీపంలోని తుంగభద్రా నదిలో తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో ఇటీవల బోటింగ్‌ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఆలయ దర్శనానికి వచ్చే భక్తులు, యాత్రికులు కుటుంబ సమేతంగా బోటింగ్‌ చేస్తూ నది తీర అందాలను ఆస్వాదిస్తున్నారు. దీంతో గురువారం తుంగభద్ర నది వద్ద సందడి వాతావరణం నెలకొంది.