హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖైరతాబాద్‌లో ఆకతాయిలపై పోలీసుల నిఘా

HYD: ఖైరతాబాద్ వినాయకుడి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ నేపథ్యంలో మహిళల భద్రతపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సీసీ కెమెరాలు, ప్రత్యేక నిఘాతో ఆకతాయిలను గుర్తిస్తూ వారిపై చర్యలు చేపడుతున్నారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.