హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రోడ్డుపై పడిన బండరాళ్లు

NGKL: అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలోని ఇంగ్లాండ్ టన్నెల్ మార్గంలో కొండపై నుంచి భారీ బండరాళ్లు రోడ్డుపై పడ్డాయి. ఆ సమయంలో వాహనాలు, ప్రయాణికులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో కొండచరియలు విరిగిపడుతున్నాయని పోలీసులు తెలిపారు. శ్రీశైలం వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.