హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పురుషోత్తపట్నం పంపుల ఆపరేట్‌పై మంత్రి ఆదేశం

E.G: భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి నిమ్మల ఇరిగేషన్ ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏలేరు రిజర్వాయర్ క్యాచ్ మెంట్‌లో నమోదయ్యే వర్షపాతాన్ని బట్టి పురుషోత్తపట్నం పంపులను ఆపరేట్ చేయాలని అధికారులను ఆదేశించారు. రిజర్వాయర్లు, నదులు, వాగుల్లోకి వచ్చే వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే, ప్రజలను కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.