హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంత్యక్రియలకు కూడా అవస్థలే..!

VZM: పెద్దకథ గ్రామస్తులు స్మశాన వాటిక లేక నానా అవస్థలు పడుతున్నారు. దహనసంస్కారాలు నిర్వహించాలంటే ఏడుంపులగడ్డ వాగు దాటాల్సిందే. అయితే, ఇటీవల కురుస్తున్న వర్షాలకు వాగు ఉప్పొంగింది. ఈ కష్ట సమయంలో ఊరిలో ఓకేసారి ఇద్దరు మరణించారు. మృతదేహాలను వాగు దాటించి అంత్యక్రియలు చేయడానికి నరకయాతన పడ్డారు. అధికారులు స్పందించి సమీపంలోనే స్మశాన వాటిక ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.