హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పేదలకు కనీస వైద్యం అందని దుస్థితి'

WGL: పేదలకు కనీస వైద్యం కూడా అందని పరిస్థితి నెలకొందని తెలంగాణ ఉద్యమ సమితి రాష్ట్ర కార్యదర్శి అమ్మ అశోక్ అన్నారు. ప్రజా పాలన పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. గురువారం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో సరిపడా పడకలు లేకపోవడం, భవనం పైకప్పులు పెచ్చులూడటం, అంబులెన్సుల కొరత వంటి సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.