MBNR: మిడ్జిల్ మండల కేంద్రంలోని కొత్తూరు రహదారి వెంట ఏర్పాటు చేస్తున్న సోలార్ విద్యుత్ స్తంభాలు ప్రమాదభరితంగా ఉన్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీసీ రోడ్డుకు అత్యంత సమీపంలో స్తంభాలు ఏర్పాటు చేయడంతో వాహనదారులకు ఇబ్బందులు, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అధికారులు స్పందించి రహదారికి తగిన దూరంలో స్తంభాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
తెలంగాణ
రోడ్డుకు ఆనుకుని సోలార్ స్తంభాలు!


