హైదరాబాద్: 28°C
తెలంగాణ

గోరి కొత్తపల్లిలో కోతుల బెడద

BHPL: గోరి కొత్తపల్లి మండల కేంద్రంలో కోతుల బెడద రోజురోజుకూ పెరుగుతోంది. పంట పొలాల్లోకి చొరబడుతున్న కోతులు పత్తి, మిరప మొక్కలను విరిచేస్తూ పంటలను నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టంతో ఇబ్బందులు పడుతున్న తమను ఆదుకోవాలని, కోతుల బెడద నివారణకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.