హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుచానూరు బ్రహ్మోత్సవాలకు భారీగా ఏర్పాట్లు

TPT: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను డిసెంబర్ 5 నుంచి 14 వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ జేఈఓ ఏ. శరత్ తెలిపారు. గురువారం అధికారులతో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. గత ఏడాదితో పోలిస్తే 15–20 శాతం భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందన్నారు. పంచమి తీర్థం రోజున నాలుగు హోల్డింగ్ పాయింట్లు, క్యూ లైన్లు, బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.