హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుట్టపర్తిలో అభివృద్ధి పనులకు శ్రీకారం

సత్యసాయి: పుట్టపర్తి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గురువారం భూమిపూజ చేశారు. సంత మార్కెట్ రోడ్డులో రూ. 20 లక్షలు, కర్ణాటక నాగేపల్లి రోడ్డులో రూ.17.50 లక్షలు, సాయినగర్‌లో రూ.22.50 లక్షలతో డ్రైనేజీ, సీసీ రోడ్డు, ప్రహరీ నిర్మాణ పనులను ప్రారంభించారు.