SKLM: తుఫాన్ ప్రభావంతో జలమయమైన కుందువానిపేటలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో బాధితులకు నిత్యావసరాలు అందజేశారు. పాలు, బ్రెడ్, బిస్కెట్లు, అరటిపళ్లు పంపిణీ చేశారు. అంతకుముందు కిల్లిపాలెం - మదనాపురం రహదారిపై భారీ చెట్లు విరిగిపడి రాకపోకలకు అంతరాయం ఏర్పడగా, క్లబ్ అధ్యక్షులు నటుకుల మోహన్ బృందం స్థానికుల సాయంతో కొమ్మలను తొలగించారు.
ఆంధ్రప్రదేశ్
వర్ష బాధితులకు లయన్స్ క్లబ్ సాయం


