VSP: రాష్ట్ర సమాచార కమిషనర్ చావలి సునీల్ గురువారం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయ సహాయ ఈవో పిల్లా శ్రీనివాసరావు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్న అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. దేవస్థానం తరఫున శేషవస్త్రంతో సత్కరించి, స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
అప్పన్నను దర్శించుకున్న సమాచార కమిషనర్


